Raghu
Tuesday, December 2, 2014
मंदिर में फूल चढ़ाने गये तो ये एहसास हुआ की
पत्थरोंको कुश कराने के लिए फूलों को कथिल कराया हम
मिठाने गया थे पाप अपने जहां एक और पाप कराया हम II
Sunday, August 17, 2014
వివాహం !!
వివాహం !!
వరుడికి వంశాభివృధ్ధి,పితృఋణం నుంచి విముక్తి ...
కన్యాదాతకు బ్రహ్మలోక ప్రాప్తి ...
వధూవరులిద్దరికి ధర్మభద్ధ కామ సంతృప్తి ...
సమాజానికి సద్ గృహస్థు సేవలందుకునే సిద్ధిని
విశిష్ఠంగా కలిగించే పుణ్య విశేషం....
వివాహం .
Monday, April 14, 2014
Evergreen Sirivennala Sahityam
Movie : Kallu (1988)
Music : SP Balasubramanyam
Lyrics : Sirivennela seetharama sastry
Singer : Sirivennela seetharama sastry
తెల్లారింది లెగండో కొక్కొరొక్కో
మంచాలింక దిగండో కొక్కొరొక్కో
తెల్లారింది లెగండో కొక్కొరొక్కో
మంచాలింక దిగండో కొక్కొరొక్కో !!
1.పాములాంటి సీకటి పడగదించి పోయింది
భయం నేదు భయం నేదు నిదర ముసుగు తీయండి
సావు లాటి రాతిరి సూరు దాటి పోయింది
భయం నేదు భయం నేదు సాపలు సుట్టేయండి
ముడుసుకున్న రెక్కలిడిసి పిట్ట చెట్టు ఇడిసింది
ముడుసుకున్న రెక్కలిడిసి పిట్ట చెట్టు ఇడిసింది
మూసుకున్న రెప్పలిడిసి సూపులెగరనీయండి !!
తెల్లారింది లెగండో కొక్కొరొక్కో
మంచాలింక దిగండో కొక్కొరొక్కో!!
2.సురుకు తగ్గిపోయింది చందురుడి కంటికి
సులకనైపోయింది లోకం సీకటికి
కునుకు వచ్చి తూగింది చల్లబడ్డ దీపం
ఎనక రెచ్చిపోయింది అల్లుకున్న పాపం
మసక బారిపోయిందా సూసే కన్ను
ముసురుకోదా మైకం మన్ను మిన్ను
కాలం కట్టిన గంతలు తీసి కాంతల ఎల్లువ గంతులు ఏసి !!
తెల్లారింది లెగండో కొక్కొరొక్కో
మంచాలింక దిగండో కొక్కొరొక్కో!!
3.ఎక్కిరించు రేయినిచూసి ఎర్రబడ్డ ఆకాసం
ఎక్కు పెట్టి ఇసిరిందా సూరీడి చూపుల బాణం
కాలి బూడిదైపోదా కమ్ముకున్న నీడ
ఊపిరితో నిలబడుతుందా చిక్కని పాపాల పీడ
సెమట బొట్టు సమురుగా సూరీడ్ని ఎలిగిద్దాం
ఎలుగు చెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం
వేకువ చెట్టున కత్తులు దూసి రేతిరి మత్తును ముక్కలు చేసి !!
తెల్లారింది లెగండో కొక్కొరొక్కో
మంచాలింక దిగండో కొక్కొరొక్కో!!
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)