పిల్ల గాలుల పల్లకీలో మల్లె మధువై నీలో చేరి
నిన్ను చూస్తూ నన్ను నేనే వెదుకుకొంటున్నా....
మరచి విశ్వము మరచి నేనే మరచి సర్వము నన్ను నేనే
మౌనమే మకరందమౌతు మురిసిపోతున్నా ....
కన్న కలలే వెన్నెలౌతు కన్నులెదుటే విరగబూసే
ఎన్ని జన్మల పుణ్యఫలమో నిన్ను కలిసితిని..
అలుకలన్నీ ఆవిరయ్యే వేదనంతా వేడుకయ్యే
చీకటంతా వెలుతురయ్యే చెలిమి తోడయ్యే...
ఆకశములో చందమామ కొలను పూసిన కలువ భామ
నేల నడిచెను కలసి మెలసి కొత్త దారులలో....
పలుకు తేనెల గోరువంకతో పంజరములో రామచిలుకను
కలిపి నడిపిన బ్రహ్మరాతను మార్చు వారెవరో....
గోరు వెచ్చని నింగి మనసు ఆకు పచ్చని నేల సొగసు
కలిసి కమ్మని తోడు నీడై అడుగులేసేనా....
నేల రాలిన చినుకు వానకు వాన నీరే పారు యేరగు
పారు యేరులే పొంగి పొరలుతు సంద్రమయ్యెనుగా...
అంత సంద్రమె ఆవిరౌతు మబ్బులోపల చేరె నీరై
అట్టి నీరే చిట్టి చినుకై మట్టి తాకెనుగా....
మనసులొకటై మమతలొకటై ఆశలొకటై బాసలొకటై
పరిమళించిన జంట మల్లెలు జతను వీడేనా...